ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్రభాష తెలుగు భాష:
భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి . భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం , తమిళం , కన్నడ భాషలకు 2008 లో ప్రాచీన భాష హోదా ఇచ్చి గౌరవించింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు ఆంధ్రప్రదేశ్ తరువాత తెలుగువాళ్ళు ఎక్కువగా తెలంగాణ , యానం ( పుదుచ్చేరి , తమిళనాడు , కర్నాటక , మహారాష్ట్ర , ఒడిశా , ఛత్తీస్ఘ డ్ రాష్ట్రాలలోనూ నివసిస్తున్నారు . తెలుగు మాతృభాషగా కలిగి ఉన్నవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు . 2011 జనారా లెక్కల ప్రకారం 8.11 కోట్లల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ( హిందీ , బెంగాలీ మరాళీ తరువాత ) నాల్గొవ స్థానంలోనూ , ప్రపంచ వ్యాప్తంగా 16 వ స్థానంలోనూ నిలిచింది .రాష్ట్ర అధికార చిహ్నం :
ఆంధ్రప్రదేశ్ కు కొత్త అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం 14 నవంబర్ 2018 న ప్రకటించింది . మల్టీకలర్ , నీలం , నలుపు , తెలుపు రంగుల్లో చిహ్నాన్ని ఖరారు చేశారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి అమరావతి శిల్పకళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు . దీనిలో చుట్టూ త్రిరత్నాలు , మధ్యన అందంగా ఉన్న ఆకులు , రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క ( ధర్మ చక్రం ) ఉంటుంది . క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి వీరికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం ( పూర్ణ ఘటం ) చిహ్నం మధ్యలో ఉంటుంది . పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తలు వరుసగా 48 , 118 , 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి . పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది . చిహ్నం పైభాగంలో ' ఆంధ్రప్రదేశ్ అని , కింది భాగంలో సత్యమేవజయతే ' అని తెలుగులో రాసి ఉంటుంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఇవి ఆంగ్లంలో రాసి ఉండేవి . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో ' పూర్ణకుంభం ' ఉండేది . కాని రాష్యకటక మహాచైత్యంలో ఉన్నది . పూర్ణమటమే తప్పు పూర్ణకుంభం కాదని ఆ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది .రాష్ట్ర క్రీడ :
కబడ్డీ ? ప్రతి గ్రామీణ ప్రాంతంలో కనిపించే క్రీడ కబడ్డి , దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార క్రీడగా గుర్తించింది . కబడ్డీ క్రీడను మన రాష్ట్రంలోనే కాక పంజాబ్ రాష్ట్రం కూడా అధికార క్రీడగా గుర్తించింది .రాష్ట్ర జంతువు :
కృష్ణజింక : పొడవాటిమెలికలు తిరిగిన కొమ్ములు కలిగి వివిధ వర్గపు మచ్చలు కలిగి అందంగా కనిపించే అంతువు కృష్ణ జింక . దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా గుర్తించింది . దీని శాస్త్రీయనామం ఏంటిలోప్ సెర్వికాప్రా ,