తెలంగాణ రాష్ట్రం గతంలో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది . దీన్ని నిజాం నవాబులు పాలించేవారు . 1948 , సెప్టెంబర్ 17 న ' ఆపరేషన్ పోలో అనే మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఇండియన్ యూనియలో కలిపారు . 1956 , నవంబర్ 1 న ఆంధ్రరాష్ట్రం + హైదరాబాద్ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది . అటు తర్వాత 2014 జూన్ 2న 10 జిల్లాలతో దేశంలో తెలంగాణ 29 వ రాష్ట్రంగా అవతరించింది . మహబూబ్ నగర్ , రంగారెడ్డి , హైదరాబాద్ , నల్గొండ , మెదక్ , వరంగల్ , నిజామాబాద్ , కరీంనగర్ , ఖమ్మం , ఆదిలాబాద్ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేయడానికి 2016 , అక్టోబర్ 11 న రాష్ట్రంలో 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు . దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 31 కి చేరింది . రెవెన్యూ డివిజన్లు -69 , మున్సిపాలిటీలు -136 , మున్సిపల్ కార్పొరేషన్లు -6 , గ్రామ పంచాయతీలు 12,751 రెవెన్యూ మండలాలు 585 ఉన్నాయి .
తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్రభాష తెలుగు భాష :తెలుగు
భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగుకుడా ఒకటి.భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం , తమిళం , కన్నడ భాషలకు 2008 లో అఆ " ప్రాచీన భాష హోదా ఇచ్చి గౌరవించింది . తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార భాష- తెలుగు , తెలంగాణ తరువాత తెలుగు వాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ , యానం ( పుదుచ్చేరి ) , తమిళనాడు , కర్నాటక , మహారాష్ట్ర ఒడిశా , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోనూ నివసిస్తున్నారు . తెలుగు మాతృభాషగా కలిగి ఉన్నవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు . 2011 జనాభా లెక్కల ప్రకారం 8.11 కోట్ల జనాభాతో భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ( హిందీ , బెంగాలీ , మరాఠీల తరువాత ) నాల్గవ స్థానంలోనూ , ప్రపంచ వ్యాప్తంగా 16 వ స్థానంలోనూ తెలుగు నిలిచింది .
రాష్ట్ర అధికార చిహ్నం :
2014 , జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త అధికారిక చిహ్నాన్ని రూపొందించింది . ఇందులో కాకతీయ కళాతోరణం , చార్మినార్ తోపాటుగా భారతదేశ అధికారిక చిహ్నం అయిన ' లయన్ కాపిటల్ ను కూడా తీసుకున్నారు . ఈ చిహ్నాన్ని " ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ రూపొందించారు .
రాష్ట్ర పక్షి : పాలపిట్ట
పాలపిట్ట : పాలపిట్ట ( ఇండియన్ రోలర్ బ్లూ జాయ్ ) తెలంగాణ సంస్కృతిలో భాగం . దానిని శుభ శకునంగా భావిస్తారు . లంకపై దండయాత్ర చేసే సమయంలో రాముడు పాలపిట్టను సందర్శించుకోవడంవల్ల విజయం సాధించారని పౌరాణిక గాధలు తెలుపుతున్నాయి . పాలపిట్ట శాస్త్రీయ నామం కొరల్ కాస్ బెంగలెన్సిస్.
రాష్ట్ర జంతువు :మచ్చల జింక
మచ్చల జింక , రామాయణం వంటి గాధలలో జింక కు ( స్పాటెడ్ ఓర్ ) ప్రముఖ స్థానం ఉంది . తెలంగాణలో అన్ని జిల్లాల్లో జింకలు సంచరిస్తాయి . జింక శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్
రాష్ట్ర వృక్షం :జమ్మిచెట్టు
జమ్మి చెట్టు తెలంగాణ ప్రజా జీవితంలో అంతర్భాగం . దసరా సందర్భంగా జమ్మికి పూజలు చేసి ఆకులను తీసుకెళ్లడం తెలంగాణలో ఆనవాయితి . పాండవులు అజ్ఞాతవాసంలో ఆయుధాలను ఈ చెట్టుపైనే భద్రపరిచారని , ఆ తర్వాత దీనికి పూజలు చేసి ఆయుధాలు తీసుకెళ్లి యుద్ధంలో గెలిచారని పురాణ గాథలు తెలుపుతున్నాయి . జమ్మిచెట్టు శాస్త్రీయ నామం ప్రోసోపిన్ సివరేరియా.
రాష్ట్ర పుష్పం :
తంగేడు పువ్వు తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మలో వాడే తంగేడు పూలకు ఘనమైన చరిత్ర ఉంది . అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది . తంగేడు పూల రాష్ట్రీయ నామం కేసియా అరిక్యులేటా .
రాష్ట్ర చేప :-కొరమీను
కొరమీను తెలంగాణరాష్ట్రఅధికారిక చేపగా కొరమీనును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . దీన్నే మరేల్ లేదా మురేల్ ఫిష్ గా పిలుస్తారు . ప్రతీ రాష్ట్రానికి అక్కడ జీవించే మత్సజాతులు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి . తెలంగాణకు ప్రత్యేకంగా 109 రకాల చేప జాతులున్నట్లు జీవ వైవిధ్య మండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది . మత్స్యశాఖ పంపిన ప్రతి పాదనలను పరిశీలించిన ప్రభుత్వం కొరమీనును అధికారిక చేపగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది . కొరమీను శాస్త్రీయ నామం చెన్నా స్త్రయేటస్ .
రాష్ట్ర పండుగ : బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది . బతుకమ్మ పండుగను రాష్ట్రంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు . బతుకమ్మ (గౌరి ) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది . బతుకమ్మను రకరకాల పువ్వులతో తయారు చేసి , గౌరమ్మను పసుపుతో చేసి బతుకమ్మను మధ్యలో ఉంచి పూజ చేస్తారు . రాష్ట్రంలోని ఆడపడుచులు , పిల్లలు , పెద్దలు ఒక్కటై " బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడుతారు . ఈ బతుకమ్మను గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా లభించే తంగేడు పూలు , గునుగు పూలు , చామంతి , బంతి పూలతో తయారు చేస్తారు .
రాష్ట్ర పండుగ : బోనాలు
తెలంగాణ లో అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాడ బోనాల వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది . శక్తి స్వరూపిణి అయిన మహంకాళికి బ బోనం ( భోజనం ) తయారు చేస్తారు . ఈ బోనాన్ని పసుపు , కుంకును , వేపాకులతో అలంకరించిన మట్టికుండలో ఉంచి పాత్ర పై మూత పెడతారు . మూతపై దీపం వెలిగిస్తారు . ఈ విధంగా బోనాన్ని అలంకరిస్తారు . ప్రతి ఏటా గోల్కొండ బడాబజార్ లో ఆలయ పూజారి ఇంటి నుండి ప్రారంభమై 9 రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు హిందూ ముస్లిం స్నేహానికి ప్రతీకగా నిలుస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి .