మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇష్టమైన తెలుగు పుస్తకాలు
ప్రముఖ దర్శకుడు సినీ మాటల రచయిత అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా లో తన దర్శకత్వంతో అలాగే దానికంటే ముఖ్యంగా తన మాటల (డైలాగ్స్) ద్వారా ప్రేక్షకులను అలరిస్తారు . సినిమా లోనే కాకుండా బయట ఆడియో ఫంక్షన్లలో కూడా తన డైలాగ్స్ తో అబ్బురపరుస్తారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పుస్తకం మనిషిని గొప్ప వ్యక్తి గా తీర్చుతుంది అని ఆయన అంటూంటారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చిన్న తనం నుంచే పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం .ఆయన తన సినిమా ల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు.
కాబట్టి ఆయనను తన అభిమానులు 'గురూజీ' అని ప్రేమ గా పిలుస్తారు. ఆయనకు పుస్తకాలు ఎంతో ప్రేరణగా నిలిచాయి .
ఆయన పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతుంటారు.
కాబట్టి ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పుస్తకాలు అందులోనూ మన తెలుగు పుస్తకాలు ఏమిటో తెలుసుకుందాం.
1.దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన- అమృతం కురిసిన రాత్రి
2.డా.పి .శ్రీదేవి గారు రచించిన -కాలాతీతవ్యక్తులు
3.శ్రీ. శ్రీ గారు రచించిన - మహాప్రస్థానం
4.విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన - వెయిపడగలు
5.యద్దనపూడి సులోచన రాణి గారు రచించిన - కీర్తికిరిటలు
6. శీలా వీర్రాజు గారు రచించిన - మైన
7. బుచ్చిబాబు గారు రచించిన - చివరకు మిగిలేది
8.రంగ నాయకమ్మ గారు రచించిన - జానకి విముక్తి
9.చలం గారు రచించిన మ్యూజింగ్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చదివిన పుస్తకాలు ఎన్నో కానీ నచ్చిన పుస్తకాలు కొన్నే
కాబట్టి గొప్ప వారైనా వారికి ఖచ్చితం గా పుస్తక పఠన అలవాటు వుండే ఉంటుంది.