నూతనంగా రూ 2000 , రూ . 500 , రూ .200 , 100 , రూ .50 , 10 కరెన్సీ నోట్లు ను
ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం
2016 , నవంబర్ 8 న రూ . 500 , రూ . 1000 కరెన్సీ నోట్లు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది . అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను గతంలో రెండుసార్లు ప్రభుత్వం రద్దు చేసింది . 1946 లో రూ . 1000 , రూ .10 వేల నోట్లను ఉపసంహరించారు . 1954 లో రూ .1000 , రూ . 5 వేలు , రూ . 10 వేల నోట్లను తిరిగి ప్రవేశ పెట్టారు . 1978 లో జనతా పార్టీ ప్రభుత్వం రూ . 1000 , రూ . 5 వేలు , రూ . 10 వేల నోట్లను రద్దు చేసింది . రూ . 1000 నోట్ 2000 నవంబరులో తిరిగొచ్చింది . రూ . 500 నోటు మళ్లీ 1987 అక్టోబరులో వచ్చింది . ద్రవ్యోల్బణం కారణంగా చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది . రూ .2 వేల నోటును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి . భారత రిజర్వు బ్యాంకు ఇప్పటివరకూ ముద్రించిన కరెన్సీలో అధిక విలువ కలిగిన నోటు రూ . 10 వేలు . వీటిని తొలిసారిగా 1938 లో ముద్రించారు . నూతన రూ . 2000 , రూ .500 నోట్లను ప్రభుత్వం నవంబర్ 10 , 2016 నుంచి అమల్లోకి తెచ్చింది . వీటితోపాటుగా మహాత్మాగాంధీ నూతన సిరీస్ పేరుతో కొత్త రూ .200 , 100 రూ . 50 , 10 | నోట్లను ఆర్.బి.ఐ విడుదల చేసింది .
₹ 2000
నోటు పరిమాణం పొడవు 166 మి.మీ. వెడల్పు 66మి.మీ , రంగు మెజంతా
* ముందు వైపు
దేవనాగరి లిపిలో రూ .2000 సంఖ్య మధ్య ! భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ చిన్న అక్షరారాలతో ఆర్.బి.ఐ , 2000 గవర్నర్ సంతకం ఆర్.బి.ఐ చిహ్నం కుడివైపునకు • మార్పు , మహాత్మాగాంధీ బొమ్మ ఎలక్ట్రోటైప్ ( 2000 ) వాటర్ మార్క్ కుడివైపున అశోక స్తూపం చిహ్నం .
అంధులకోసం :
మహాత్మాగాంధీ బొమ్మ అశోక స్థూపం చిహ్నం , బ్లీడ్ లైన్స్ గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగాఉంటాయి.
వెనుకవైపు :
నినాదాలతో సహా స్వచ్ఛభారత్ లోగో , మధ్య భాగంలో భాషల ప్యానల్ , మంగళయాన్ ' చిత్రం.
₹ 500
నోటు పరిమాణం పొడవు 150 మి.మీ ; వెడల్పు 63 మి.మీ. రంగు స్టోన్ గ్రే* ముందు వైపు
దేవనాగరి లిపిలో 500 సంఖ్య మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ గవర్నర్ సంతకం , ఆర్.బి.ఐ చిహ్నం కుడివైపునకు మార్చారు . మహాత్మా గాంధీ బొమ్మ ఎలక్ట్రో వాటర్ మార్క్ కుడివైపున అశోక స్తూపం చిహ్నం .అంధులకోసం :
మహాత్మాగాంధీ బొమ్మ అశోక స్తూపం చిహ్నం , నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లు లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి* వెనుకవైపు
నినాదాలతో సహా మా స్వచ్ఛభారత్ లోగో భారత వారసత్వ ప్రదేశం ఎర్ర కోట జాతీయ జెండా , కుడివైపున దేవనాగరి లిపిలో రూ . 500 సంఖ్య200
నోటు పరిమాణం :
పొడవు 146 మి.మీ. వెడల్పు 66 మి.మీ , రంగు : బ్రైట్ ఎల్లోకొత్త ! 200 డినామినేషన్ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు 2017 , ఆగష్టు 25 న కొన్ని ఎంపిక చేసిన ఆర్.బి.ఐ కార్యాలయాలు , బ్యాంకుల ద్వారా విడుదల చేసిింింది నోటు వెనుకభాగంలో దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతిబింబించే సాంచీ స్థూపం చిత్రాన్ని ముద్రించారు . నోటు ప్రాథమిక రంగు " ఏల్లో , ఇతర డిజైన్లు , జియోమెట్రిక్ నాముునా లు. కూడా మొత్తం నోటుకు రెండువైపులా ఉండే రంగులో భాగంగా ఉంటాయి .
దృష్టిలోపం ఉన్న వారికోసం :
ఏటరియో లేదా ఉబ్బుగా ఉన్న మహాత్మాగాంధీ చిత్రం , అశోకుడి స్థూపంతో పాటు హెచ్ ' అక్షరం , సూక్ష్మ అక్షరాలతో | 200 , నాలుగు కోణీయ టైడ్ లైను , వీటి మధ్య రెండు వృత్తాలు ఉంటాయి . ఇవి నోటుకు రెండు వైపులా ఉంటాయి .
₹ 100
నోటు పరిమాణం : పొడవు 142 మి.మీ. వెడల్పు 66 మి.మీ. రంగు : లావెండర్
ముందు వైపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ . 100 నోటును మార్కెట్లో ప్రవేశపెట్టింది . మహాత్మాగాంధీ సిరీస్ లో భాగంగా తీసుకొచ్చి ఈనోటు వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రాణీ కి వావ్ ' ఉంది . లావెండర్ కలర్ లో ఈ నోటు ఉంది . నోటు ముందు భాగంలో 100 అంకె ఉంటుంది . దేవనాగరి లిపిలోనూ ఇది ఉంటుంది . మిగతా నోట్ల తరహాలోనే మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది . ఇంగ్లీష్ లో ఆర్.బి.ఐ ఇండియా హిందీలో భారత్ , 100 అనే అక్షరాలను పొందుపరిచారు . గాంధీ ఫొటోకు కుడివైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది . కుడివైపు అశోకుడి నాలుగు సింహాలు .. గాంధీ , 100 సంఖ్యల వాటర్ మార్క్ ఉంటాయి .* వెనుక వైపు
నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో , నినాదం ఉంటుంది . రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషల్లో వంద రూపాయలు అని రాసి ఉంటుంది . రాణికి వావ్ చిత్రం ఉంటుంది .₹50
నోటు పరిమాణం :
పొడవు 135 మి. మీ.:వెడల్పు 66 మి.మీ. రంగు : ఫ్లోరోసెంట్ బ్లూకొత్త - 50 డినామినేషన్ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టింది . నోటు వెనుక భాగంలో దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రస్ఫురించే రీతిలో హంపి రథం చిత్రాన్ని ముద్రించారు . నోటు ప్రాథమిక రంగు పోరోసెంట్ బ్లూ , ఇతర డిజైన్లు , జియోమెట్రిక్ నమూనాలు కూడా మొత్తం నోటుకు రెండువైపులా ఉండే రంగులో భాగంగా ఉంటాయి .
₹ 10
నోటు పరిమాణం
పొడవు 123 మి.మీ వెడల్పు 63 మి.మీ , రంగు చాక్లెట్ బ్రౌన్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 10 రూపాయల నోటును విడుదల చేసింది . మహాత్మా గాంధీ సిరీస్లో భాగంగా తీసుకొచ్చిన ఈ నోటు వెనుక భాగంలో భారతీయ సంస్కృతి తెలియచేసేలా కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది . నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో నినాదం ఉంటుంది .
x