united nations in telugu united nations organisation in telugu ఐక్యరాజ్య సమితి

     

              ఐక్యరాజ్య సమితి


 యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని 1942 లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ సూచించాడు . ఏప్రిల్ 25 జూన్ 26 , 1945 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యుఎన్ చార్టర్ ను రూపొందించాయి . చార్టర్ పై 50 దేశాలు జూన్ 26 , 1945 నాడు సంతకాలు చేశాయి . 1945 లోనే భారత్ కూడా సభ్యత్వం పొందింది . శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలెండ్ దేశం చార్టర్ పై సంతకం చేసి 51 వ సభ్యదేశంగా అవతరించింది . 2011 లో దక్షిణ సూడాన్ 193 వ దేశంగా చేరింది .

 *అధికార భాషలు :-

 అరబిక్ , చైనీష్ , ఇంగ్లీష్ , ఫ్రెంచ్ , రష్యన్ , స్పానిష్

*ప్రధాన అంగాలు :

 జనరల్ అసెంబ్లీ , సెక్రటేరియట్ , సెక్యూరిటీ కౌన్సిల్ , ట్రస్టీషిప్ కౌన్సిల్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ , ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్

*ప్రధాన కార్యాలయం :-

న్యూయార్క్ ( అమెరికా )


 *సభ్యుల సంఖ్య :

193


 1. సాధారణ సభ ( జనరల్ అసెంబ్లీ ) : 


ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలన్నీ జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తాయి . ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది . అయితే ఐదుగురు ప్రతినిధులను సభకు పంపవచ్చు . సాధారణ సభ సంవత్సరాని కి ఒక్కసారిఅయిన  సమావేశమవ్వాలి . సాధారణ సభ అధ్యక్ష , ఉపాధ్యక్షుల పదవీకాలం ఒక సంవత్సరం , 

జనరల్  అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మీ పండిట్ . 

2. భద్రతా మండలి ( సెక్యూరిటీ కౌన్సిలి ) : 

సభ్య దేశాల సంఖ్య - 15 , శాశ్వత సభ్యదేశాలు-5 , తాత్కాలిక సభ్యదేశాలు- 10. తాత్కాలిక సభ్యదేశాలు రెండేళ్ల కాలానికి సాధారణ  సభచే  2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి . శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారముంటుంది . మొత్తం ఏడు సార్లు భారత్ బద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికయింది. . 

* శాశ్వత సభ్యదేశాలు :

 చైనా , ఫ్రాన్స్ , రష్యా , యునైటెడ్ కింగ్డమ్ , అమెరికా 


3. ఆర్థిక మరియు సామాజిక మండలి ( ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ - ECOSOC ) : 

ఆర్థిక మరియు సామాజిక మండలి సాధారణ సభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్థిక , సామాజిక సాంస్కృతిక , విద్య , ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలలో సమన్వయం కొరకు కృషి చేస్తుంది . సాధారణ సభ చేత మూడేళ్ల కాలానికి 2/3 వంతు మెజారిటీతో సభ్యదేశాలు ఎన్నికవుతాయి . 1/3 వంతు దేశాలు ప్రతిఏటా పదవీ విరమణ చేస్తాయి . ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది . సభకు హాజరైన సభ్యదేశాలు మెజారిటీ ఓటింగ్ పద్ధతిన నిర్ణయాలు తీసుకుంటాయి.


 *సభ్య దేశాల సంఖ్య : 54 .      




4. ధర్మకర్తృత్వ మండలి ( ట్రస్టీషిప్ కౌన్సిల్ ) : 

ఇతర దేశాల పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడుట ఈ మండలి ముఖ్యోద్దేశం . వాటికి స్వాతంత్ర్యం కల్పించుట లేదా స్వపరిపాలనకు రంగం సిద్ధం చేయుటకు ఈ మండలి కృషి చేస్తుంది .

సభ్యదేశాలు : చైనా , ఫ్రాన్స్ , రష్యా , బ్రిటన్ , అమెరికా


5. అంతర్జాతీయ న్యాయస్థానం ( ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ )

అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ఏర్పడింది . అంతర్జాతీయ న్యాయస్థాన చట్టం యుఎన్ చార్టర్  లో భాగం.  వివిధ దేశాల మధ్య తలెత్తే తగాదాలు , అధికారిక అంతర్జాతీయ సంస్థలు సమ ర్పించే న్యాయ పరమైన ప్రశ్నలకు సలహాలనివ్వడం ఈ   న్యాయస్థానం ముఖ్య విధులు . అంతర్జాతీయ. న్యాయస్థానం వివిధ దేశాలకు చెందిన 15 మంది న్యాయమూర్తులను కలిగి ఉంటుంది . ఈ  న్యాయముర్తి       9 ఏళ్ల పదవీ కాలానికి గానూ సాధారణ సభ మరియు భద్రతా మండలిచే ఎన్నికవుతారు . 1/3 వంతు న్యాయమూర్తులు మూడేళ్లకోసారి పదవీ విరమణ చేస్తారు .

*అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినభారతీయులు - బి.ఎన్.రావు , నాగేందర్ సింగ్ మరియు ఆర్.ఎస్.పాఠక్ , దల్వీర్  బండారి 


*అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికయిన మొదటి మహిళా అధ్యక్షురాలు రోజాలివ్ హిగ్గిన్స్ ,

అధికార భాషలు : 

ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్

*ప్రధాన కార్యాలయం :

 ది హేగ్ ( నెదర్లాండ్స్ ) .


 6. సచివాలయం. (  సె క్రటేరియట్ ) :

 సచివాలయం ఐక్యరాజ్యసమితి ఇతర అంగాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది . సచివాలయ అధిపతైన సెక్రటరీ జనరలను     సాధారణ సభ ఏర్పర్చిన నియమ నిబంధనల మేరకు .  సాధారణ సభ భద్రతా మండలి సిఫార్సుపై నియమిస్తుంది . సెక్రటరీ జనరల్ పదవీకాలం 5 సంవత్సరాలు . సాధారణ సభ ఏర్పర్చిన నియమ నిబంధనల మేరకు సెక్రటరీ జనరల్ అంతర్జాతీయ సిబ్బందిని నియమిస్తాడు . 1998 నుండి డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవిని సృష్టించారు . తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా కెనడాకు చెందిన లూయిస్ ప్రిచెట్టి ఎన్నికైంది .

 • ప్రధాన కార్యాలయం : మ్యాయార్క్
GOING GODARI

HI FRIENDS FOR MORE INFORMATION PLEASE SUBSCRIBE OR FOLLOW ME THANK YOU FRIENDS

*

Post a Comment (0)
Previous Post Next Post