pslv rocket in telugu | pslv rocket images in telugu | pslv rocket launcher In telugu |పీఎస్ఎల్వీ - సీ 43 ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ - సీ 43 ప్రయోగం విజయవంతం

Going godari

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) పీఎస్ఎల్‌వీ - సీ 43 ) రాకెట్ ద్వారా హైసిస్ ( హైపర్ సెక్టల్ ఇమేజింగ్ శాటిలైట్ ) అనే అత్యాధునిక భూ పర్యరేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా 2018 , నవంబర్ 29 న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది . PSLV - C 40 రాకెట్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది . సరిగ్గా 17 నిమిషాల 27 సెకన్లలో హైషీస్ ను భూమికి 636.3 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెట్టింది . అనంతరం మరో 95 నిమిషాల్లో మిగిలిన 30 గ్రహాలను ఒక్కొక్కటిగా వివిధ కక్ష్యలోకి చేర్చింది .

 * ఇస్రో చరిత్రలో అత్యంత సుదీర్ఘ సమయం సాగిన ప్రయోగం ఇదే .

 * ఇస్రో అభివృద్ధి చేసిన హైసిస్ ఉపగ్రహం ఐదేళ్లపాటు వ్యవసాయం , అడవులు , భూసర్వే , భూగర్భశాస్త్రం , తీరప్రాంత దేశీయ జల మార్గాలు , పర్యావరణ పర్యవేక్షలు , పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గుర్తింపు తదితర రంగాల్లో సేవలందించనుంది .

ప్రత్యేకతలు :

*రాకెట్ పీఎస్ఎల్వీ - సీ 43 , ఒకేసారి 31 ఉపగ్రహాల ప్రయోగం .

* హైసిస్ భారత దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం . బరువు 380 కిలోలు , దేశ రక్షణరంగ సేనలో ఐదేళ్లు పనిచేస్తుంది .

* అమెరికా( 23)భూ పరిశీలనకు , సముద్రంలో నావల కదలికలకు ఉపయోగపడే అమెరికాకు చెందిన లోక్ ఉపగ్రహాలు 16 , గ్లోబల్ -1 , సీసీరో -8 , 4 లేమూర్ ,    హెచ్ శాట్ -1 -

*సెన్ టూరి  ఆస్ట్రేలియాకు చెందినది . రిమోట్ ఇంటర్నెట్ సేవలకు ఉపయోగపడుతుంది .

 కెప్లేర్ (కేస్ నెoబర్ -1):, కెనడాకు చెందినది . ఇంటర్నెటకు ఉపయోగం .

*ప్యాక్ శాట్ . కొలంబియాకు చెందిన ఈ ఉపగ్రహాన్ని భూ పరిశీలన కోసం వినియోగిస్తారు

 *ఇన్నోశాట్-2 : మలేషియాకు చెందిన   ఈ ఉపగ్రహాన్ని భూ పరిశీలన కోసం ఉపయోగిస్తారు.

హిబేర్-1 :  నెదర్లాండ్స్  కు చెందిన ఈ ఉపగ్రహాన్ని ఇంటర్నెట్ సేవలకు వినియోగిస్తాం

 * 3 క్యాట్ -1  స్పెయిన్ కు చెందిన సైంటిఫిక్ ఎక్స్ పేమెంట్ కు ఉపయోగపడుతుంది .

 * రియాక్టర్ హెల్లో వరల్డ్ :ఫిన్లాండ్ కు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం .
GOING GODARI

HI FRIENDS FOR MORE INFORMATION PLEASE SUBSCRIBE OR FOLLOW ME THANK YOU FRIENDS

*

Post a Comment (0)
Previous Post Next Post